జిల్లా అంతట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జిల్లా అంతట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • మరింత కఠినతరం కానున్న నిఘా.
  • 24/7 పాటు నిరంతరం తనిఖీలు. 
  • పకడ్బందీగా ఎం.సి.సి అమలు.
  • కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాలోఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా అంతట కట్టుదిట్టమైన ఏర్పాటు చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చిన స్పెషల్ వ్యయ పరిషకులు బాల కృష్ణన్, వ్యయ పరిశీలకులు ప్రమోద్ కుమార్, విజయ్ నెట్ కె , యస్.పి.రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక లతో కలసి  ఎన్నికలకు సంబంధించి వ్యయ ఖర్చులపై  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  హుజూర్ నగర్ నుండి 24 మంది, కోదాడ నుండి 34, సూర్యాపేట నుండి 20, తుంగతుర్తి నుండి 14 మంది జిల్లాలో మొత్తం  92 మంది అభ్యర్థులు పోటీలలో ఉన్నారని వివరించారు. ఆయా నియోజక వర్గాల వారీగా పోటీ అభ్యర్థుల రోజు వారీ వ్యయ ఖర్చులు షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ లలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.1950  కింద అందిన 1478  ఫిర్యాదులను పరిష్కరించామని అలాగే సి. విజిల్ ద్వారా 312 రాగా 232 ఆర్.ఓ లెవల్ లో పూర్తి చేసాని అలాగే 80 ఫిర్యాదులు జిల్లా స్థాయిలో పరిష్కరించామని అన్నారు.  సువిదా యాప్ ద్వారా 971 అనుమతులు గాను 792 ఇవ్వడం జరిగిందని అలాగే 173 అనుమతులు తిరస్కరించడం జరిగిందని మిగతా 2 పరిశీలన ఉన్నాయని,  4 పెండింగ్ లో కలవని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, వివిటి, mcc, విఎస్టీ అలాగే పోలీస్ బృందాలతో24/7 నిరంతరం నిఘా పెంచి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నగదు కింద 151 కేసులలో రూ. 31433630/- లు,  4 కేసులలో బంగారం, వెండి  విలువ రూ. 12911426/-లు,  26 కేసుల లో ఇతర వస్తువుల విలువ రూ.11147956 /- లు , 652 లిక్కర్ కేసుల్లో దొరికిన అక్రమ మద్యం విలువ రూ. 37345391/-లు అలాగే పోలీస్ శాఖ ద్వారా దొరికిన 488 కేసుల్లో అక్రమ మద్యం  విలువ రూ.  1890301/-లు ,  9 కేసుల్లో దొరికిన మత్తు పదార్థాలు విలువ రూ.   5016250/-లు,  మొత్తం 1300 కేసుల్లో 9,97, 44, 954 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగదు, బంగారం, వెండి అలాగే ఇతర వస్తువులను బాధితుల ఆధారాలను పరిశీలన మేరకు గ్రీవెన్సు కమిటీ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని వివరించారు.  అక్రమ మద్యం కట్టడికి మరికొన్ని Excise బృందాలను అలాగే  వస్త్ర, గృహోపకరణ దుకాణాల గోదాముల తనిఖీలు చేపట్టేందుకు GST ఆదనవు  బృందాలను పెంచనున్నట్లు వివరించారు. బ్యాంకు, డిజిటల్ లావాదేవీలపై గట్టి నిఘా ఉంచి రోజువారి లావాదేవీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  తదుపరి యస్.పి. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లా లో 172 ప్రాంతాలలోని 348 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో   పటిష్ట భద్రత కల్పించనున్నట్లు అలాగే 7 చెక్ పోస్టులలో గట్టు నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నామని అలాగే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతలో భాగంగా  182 కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ బలగాలకు విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. సువిదా యాప్ ద్వారా వచ్చిన అనుమతులను పరిశీలన మేరకు అనుమతులు ఇస్తున్నామని వివరించారు. 1342 కేసులలో 2459 మంది  వ్యక్తులను బైండవర్ చేశామని వివరించారు. అంతకు ముందు  మీడియా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్, బ్యాంకింగ్ లావాదేవీల కేంద్రాలను కలెక్టర్ తో కలసి పరిశీలన చేశారు.
      ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్,  excise పర్యవేక్షకులు అనిత, డి.ఎస్.ఓ శ్రీధర్, sbi ఏజిఎం జ్యోతి, ఎల్.డి.ఎం. బాపూజీ, ఆర్.టి.ఓ వెంకట్ రెడ్డి, నియోజక వర్గాల వ్యయ పరిశీలకులు , ఎన్నికల విభాగం అధికారుకు తదితరులు పాల్గొన్నారు.