రేపు మెడికల్ కళాశాల ప్రారంబోత్సవం

రేపు మెడికల్ కళాశాల ప్రారంబోత్సవం
  • హైదరాబాద్ నుంచి  ఆన్లైన్లో ప్రారంభించనున్న సిఎం కేసీఆర్
  • సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బారి కృతజ్ఞత ర్యాలీ
  • కార్మిక క్షేత్రంలో మెడకిల్ కళాశాల ఏర్పాటుపై హర్షతీరేఖం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.31 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనంను శుక్రవారం సిఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నేరుగా కార్యక్రమంలో పాల్గొని బారి కృతజ్ఞత ర్యాలీ, సభను నిర్వహించనున్నారు. సూమారు 20 వేల మందితో సిరిసిల్ల లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌక్ వద్ద సభను నిర్వహించనున్నారు. కార్మిక్ష క్షేత్రమైన సిరిసిల్ల లో ఒకప్పుడు ఇంటర్ కళాశాలు కూడా సరిగా లేవని, గడిచిన 9 ఏండ్లలో సిరిసిల్ల విద్యా వ్యవస్థ, ఉన్నత విద్య సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఎలా వచ్చాయో ప్రజలకు వివరించే పరిస్థితిని మంత్రి కేటీఆర్ చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపధ్యంలో తమ అభివృద్దిని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఈ కృతజ్ఞత ర్యాలీ దోహపడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సిరిసిల్ల శివారులోని పెద్దూర్ బైపాస్ లో నిర్మించిన మెడికల్ కళాశాల లో ఆధునిక వసతులు కల్పించారు. విశాలమైన గదులు నిర్మించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మొదటి సంవత్సరం 1‌00 అడ్మీషన్లు ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలు సిరిసిల్ల మెడికల్ కళాశాల సిఎం చేతుల మీదుగా రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలు ఒకేసారి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.