త్వరలో జిపిఎఫ్ ఖాతాల బదలాయింపు  - జెడ్పీ చైర్పర్సన్  దావ వసంత సురేష్

త్వరలో జిపిఎఫ్ ఖాతాల బదలాయింపు  - జెడ్పీ చైర్పర్సన్  దావ వసంత సురేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లా ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల జిపిఎఫ్ ఖాతాలు బదలాయింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని త్వరలోనే అందరు ఉద్యోగ ఉపాధ్యాయుల జిపిఎఫ్ ఖాతాలు జగిత్యాల జిల్లాకు బదలాయింపు జరుగుతుందని జెడ్పీ చైర్పర్సన్  దావ వసంత సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ క్యాంప్  కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే, చిన్న మెట్పల్లి పాఠశాలల ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడేషన్ కోసం అవసరమైన అండర్ టేకింగ్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జెడ్పీ ఛైర్పర్సన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి ఆనందరావు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.