తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేదిలేదు... జూపల్లి అధికారులపై మండిపాటు

తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేదిలేదు... జూపల్లి అధికారులపై మండిపాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ పెంట్లవెళ్లి మండలం గోప్లపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం పరిశీలన జూపల్లి రైతులు కష్టపడి చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ అక్రమ సంపాదన ధ్యేయంగా ఒడిగడుతున్న మిల్లర్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. పెంట్లవెల్లి మండల పరిధిలోని గోపులాపూర్ గ్రామంలో రైతులు జూపల్లి అనుచరులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అకాల వర్షాల కారణంగా ఒకవైపు రైతులు నష్టపోతుంటే పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి సకాలంలో తీసుకువచ్చిన వాటిని అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ మధ్య దళారులు మిల్లర్ల కు దోహదం చేస్తున్నారని మండిపడ్డారు కొనుగోలు కేంద్రం కానుంచే డిప్యూటీ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్యను వివరించారు రైతులను మోసం చేస్తున్న మిల్లర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనియెడల రైతులను తీసుకొని జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వారితోపాటు గ్రామ మండల ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు , అనుచరులు తదితరులు పాల్గొన్నారు.