పతి గెలుపు కోసం సతి ప్రచారం

పతి గెలుపు కోసం సతి ప్రచారం

కోరుట్ల ముద్ర:  కోరుట్ల పట్టణంలోని 22 వార్డులో కోరుట్ల  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గెలిపించాలని అయన సతీమణి దీప్తి ఇంటింట ప్రచారం నిర్వించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ , కౌన్సిలర్లు ఆడెపు కమల, బట్టు రాధిక, బలిజ పద్మ కో ఆప్షన్ సభ్యురాలు రెంజర్ల కళ్యాణి, ఎంపిటిసి గుగ్గిళ్ళ ప్రియాంక సురేష్, నాయకులు సందె శ్రీపతి, తదితరులు పాల్గొన్నారు.