ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద టీవీఎస్ ఎక్సెల్‌ను  ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లికి చెందిన గుత్తికొండ తిరపతమ్మ అనే మహిళ  అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్  అతివేగమే  కారణమని , అధికారులు ఈ అక్రమ ఇసుక రవాణా పట్టించుకోలేకపోవడంతో  తరుచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు.