పొగాకుతో మసవుతున్న యువత జీవితం

పొగాకుతో మసవుతున్న యువత జీవితం

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ 
ముద్ర, ముషీరాబాద్: పొగాకుతో యువత జీవితం మసి అవుతుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా Progressive Psychologists Association India అధ్యక్షురాలు డా.హిప్నో పద్మాకమలాకర్ అన్నారు.  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31ని పురస్కరించుకొని నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లోని డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో  మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిప్నోపద్మ కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా Andhra Pradesh Psychologists Association ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రమేష్ కుమార్, సైన్స్ టీచర్ పి.సురేష్ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హిప్నోపద్మ కమలాకర్ మాట్లాడుతూ పొగాకులో ఉండే విష పదార్థాలు రోగనిరోధక వ్యవస్థను బలహినం చేస్తాయన్నారు. ఈ మధ్య కాలంలో యుక్త వయసులోనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అకాల మృత్యువుకు కారణాలలో గుండెజబ్బు మూడో స్థానంలో ఉందని చెప్పారు. పొగాకు వల్ల ఆందోళన, ఒత్తిడి పెరగడం, ఏకగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుందని తెలిపారు. హెచ్ ఐ వీ, క్యాన్సర్లకు దారితీయడమే కాకుండా  శుక్రకణాలు దెబ్బతిని, సంతానం కలగటమూ కష్ట మవుతుందని తెలిపారు.

అందరూ ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రమేష్ కుమార్ మాట్లాడుతూ  పొగాకు వాడకం వల్ల జీవనకాలమూ పదేళ్లు తగ్గుతుందని చెప్పారు. 'చాలారోజులుగా తాగుతున్నాం కదా. ఏమీ అవలేదు కదా. ఏమీ కాదు' అనుకోవద్దని చెప్పారు. ఏ వయసువారైనా పొగ అలవాటును
మానెయ్యటం మేలని తెలిపారు. సైన్స్ టీచర్ పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పొగాకు వాడకం బాగా పెరిగిందని చెప్పారు. తల్లి దండ్రులు జాగ్రత్త పడకపోతే పిల్లలు అంతమై పోయే ప్రమాదముందని హెచ్చరించారు. మనదేశంలో జబ్బులకు, మరణాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో పొగాకు అలవాటు ఒకటని చెప్పారు.. దీని మూలంగా ఏటా సుమారు 13.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.పి.స్వరూపా రాణి, జి.కృష్ణ వేణి విద్యార్థులు పాల్గొన్నారు.