సిపిఐ జిల్లా కార్యాలయం లో 77వ స్వాతంత్య్ర  దినోత్సవం వేడుకలు

సిపిఐ జిల్లా కార్యాలయం లో 77వ స్వాతంత్య్ర  దినోత్సవం వేడుకలు

భువనగిరి ఆగస్టు 15, ముద్ర న్యూస్: సిపిఐ జిల్లా కార్యాలయం ముందు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి నేటికీ 76 సంవత్సరాలు పూర్తయినప్పటికిని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని భూ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.భూములన్నీ పెత్తందారుల చేతుల్లోనే ఉన్నాయని పేద మధ్యతరగతి వారు కనీసం ఉండడానికి ఇంటి స్థలాలు ఇల్లు లేవని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, మండల కార్యదర్శి ముదిగొండ రాములు, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, సహాయ కార్యదర్శి చింతల మల్లేశం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తుపుల అభిలాష్, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే షర్ఫుద్దీన్ వాహబ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, పట్టణ నాయకులు చింతల పెంటయ్య, బద్దం వెంకటరెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు మరి పెళ్లి రాములు, ముసునూరి వెంకటేశం, చిక్క నరసయ్య, చొప్పరి సత్తయ్య, పూజిత వెన్నెల, తదితరులు పాల్గొన్నారు.