రాత్రి 50 లక్షలు -  తెల్లారి రెండు కోట్లు

రాత్రి 50 లక్షలు -   తెల్లారి రెండు కోట్లు
  • రామగుండంలో భారీ మొత్తంలో నగదు పట్టివేత
  • ఈ డబ్బు ఓటర్లకు పంచేందుకేనా

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-రామగుండంలో నిన్న రాత్రిరూ.  50 లక్షలు పట్టివేత... తెల్లారి రెండు కోట్లు ఓ ఇంట్లో ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసి రెండు కోట్ల పైనే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రామగుండం నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు పోలీసులు స్వాధీనం చేసుకోవడవం ప్రజల్లో విస్మయం గురవుతుంది. ఈఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు పెద్ద మొత్తంలో తరలిస్తుండగా పోలీసులు పటిష్టమైన సమాచార వ్యవస్థతో అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.  అయినప్పటికీ మధ్యాన్ని మాత్రం ఎక్సైజ్ అధికారులు అదుపు చేయలేకపోతున్నారు.  ఇక సమయం ముగిస్తుండడంతో ఎలాగైనా ఓటర్లను మజ్జిగ చేసుకునేందుకు అభ్యర్థులు వారికున్న అన్ని అశ్రలను ఉపయోగించి ఓట్లు రాపాట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో రామగుండంలో ఓటర్ మహాశయుడు ఎవరికి పట్టం కట్టేనో మూడు రోజులు ఆగితే గాక తెలవదు. ఏది ఏమైనా డబ్బు ప్రవాహాన్ని మాత్రం పోలీసులు మరింత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కట్టడి చేయాలని. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  ఓ ఇంట్లో డబ్బులు ఉన్నట్టు అధికారులకు ఆజ్ఞతవాసి ఫోన్ చేసి సమాచారం అందించగా, ఆ ఇంటిలో అధికారులు తనిఖీ చేయగా దాదాపు రెండు కోట్ల పైన డబ్బులు దొరికినట్లు సమాచారం