జగిత్యాలలో ఏఎన్ఎం ల మానవహారం

జగిత్యాలలో ఏఎన్ఎం ల మానవహారం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు తమ  సర్వీస్ ను క్రమబద్దికరించాలని డిమాండ్ చేస్తూ ఏడు రోజులుగా  వివిధ రీతుల్లో నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద జగిత్యాల జిల్లాలోని ఏఎన్ఎం లు మానవహారంగా ఏర్పడి నిరసన చేశారు. ఈ సందర్బంగా ఏఎన్ఎం లు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లే మమ్మల్ని కూడా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  

ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేస్తామని ఈనెల 15 వరకు ప్రభుత్వం నిర్ణయం తెలుపాలని లేదంటే 16 నుండి సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడితే  హక్కులు సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధురిమ, ఎలిజబెత్ రాణి, పద్మ, శిరీష, జమున, శారద, చిలుకమ్మ, నీరజ, స్వరూప, గణిత, రజిత, సరోజ, సౌజన్య, సునీత, జయప్రద, పుష్ప తదితరులు పాల్గొన్నారు.