కాకతీయ ప్రెస్ క్లబ్ అర్హుల జాబితా ప్రకారమే జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు

  • వారం రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు పట్టాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర 
  • సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
  • భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర కు కృతజ్ఞతలు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:గతంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తయారుచేసిన జాబితా ప్రకారమే అక్రిడేషన్ ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఇళ్ల స్థలాల విషయమై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ను కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలిసిన జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల విషయమై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,కలెక్టర్ భవేశ్ మిశ్రా తో మాట్లాడి వెంటనే స్థలాన్ని పరిశీలించాలన్నారు. వివిధ కారణాలవల్ల స్థల పరిశీలన ఆలస్యమైందని భూపాలపల్లి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ కన్వీనర్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ లు  జల్ది రమేష్, సామల శ్రీనివాస్, సామంతుల శ్యామ్, ఎడ్ల సంతోష్ ,బండ మోహన్  ,రవి భాస్కర్, జాలిగం రాజు. తడక సుధాకర్, కొంకుల సాంబయ్య, మహమ్మద్ వలి, అడ్డగట్ల శ్రీనివాస్, సురేష్ తదితరులు ఉన్నారు.