ఆదిత్య - ఎల్1 అద్భుతమైన సెల్పీ

ఆదిత్య - ఎల్1 అద్భుతమైన సెల్పీ
  • ఒకే ఫ్రేమ్ లో భూమి, చంద్రుడు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య - –ఎల్1 మిషన్ అద్భుతమైన ఫొటోలను తీసింది. ఆ ఫోటో ఫ్రేమ్ లో భూమి, చంద్రడు కనిపించారు. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒక కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ఆదిత్య –ఎల్ -1 భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ -–1 దిశగా ప్రయణిస్తుంది. అందుకు ఇంకా 4 నెలల ప్రయాణం చేయాల్సి ఉంది. తొలి 16రోజులు భూకక్ష్యలోనే ఆదిత్య –-ఎల్ 1 తిరుగుతోంది. అలా తిరుగుతూ  అద్భుతమైన ఫొటోలను తీసింది. –ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, ఎక్కడో దూరాన్ని ఉన్న చంద్రుడు ఫొటోలను బంధించింది. ఆదిత్య - –ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ దాని లోపల ఉండే కొరోనాని ఇస్రో అధ్యాయనం చేయనుంది. ఆదిత్య –- ఎల్1 మిషన్ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.