కాక్​పిట్​లోకి ప్రియురాలు

కాక్​పిట్​లోకి ప్రియురాలు

పైలెట్, కోపైలెట్​లను తొలగించిన ఎయిరిండియా
న్యూఢిల్లీ: విమనా ప్రయాణంలో ఎయిరిండియా పైలెట్​ తన ప్రియురాలిని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టి సకల మర్యాదులు చేసిన ఘటనలో ఎయిరిండియా చర్యలు తీసుకుంది. పైలెట్​, కోపైలెట్​లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన వారం రోజులు గడుస్తున్నప్పటికీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి విషయాన్ని మీడియాకు తెలపడంతో బయటికి పొక్కింది. అధికారి చెప్పిన వివరాల ప్రకారం ఎఐ–445 ఢిల్లీ–లేహ్ విమానం కాక్‌పిట్‌లోకి పైలెట్ ఆహ్వానించాడని, కోపైలెట్​ కూడా ఇందుకు సహకరించాడని వెల్లడించారు. ఈ విషయంపై పలువురు ప్రయాణికులు అభ్యంతరం తెలిపి ఫిర్యాదు చేశారన్నారు.  విచారణ చేపట్టిన ఎయిరిండియా విషయం నిజమైనదేనని రూఢీ చేసుకుంది.

అనంతరం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై దర్యాప్తునకు ఓ కమిటీని కూడా వేసినట్లు ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా చెప్పడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 27న దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అప్పుడు కూడా ఎయిరిండియా చర్యలు తీసుకుంది. ఢిల్లీ–లేహ్​మార్గం విమాన ప్రయాణాలకు అత్యంత కఠినంగా చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ఎయిరిండియా ప్రయాణికుల భద్రతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.