ఏ ఐ ఎఫ్ బి పార్టీ బీఫామ్ అందుకున్న అంబటి

ఏ ఐ ఎఫ్ బి పార్టీ బీఫామ్ అందుకున్న అంబటి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణలో బరిలో నిలిచే అభ్యర్థులకు మంగళవారం బీఫాంలను అందజేసింది. మంగళవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నియోజకవర్గం అభ్యర్థి అంబటి జోజిరెడ్డి కి మొదటి బీఫామ్ అందజేశారు. ఇప్పటికే జోజి రెడ్డి కరీంనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా గత 15 రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బీఫామ్ అందజేసిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.