కవ్వంపల్లి నోరు అదుపులో పెట్టుకో...నీ బాష మారకుంటే గుణపాఠం తప్పదు

కవ్వంపల్లి నోరు అదుపులో పెట్టుకో...నీ బాష మారకుంటే గుణపాఠం తప్పదు
  • వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్   -ఇల్లంతకుంటలో ఎంపీటీసీ ల సమావేశం  
  • ఎంపీపీ వెంకటరమణ రెడ్డికి రెండు సార్లు పదవులిచ్చినది ఎమ్మెల్యే రసమయి గారే  -ఎంపీపీ సోయిలేకుండా మాట్లాడుతున్నారు

ఇల్లంతకుంట, ముద్ర:కవ్వంపల్లి సత్యనారాయణ నీ బ్రతుకంతా అబద్దాలతోనే గడిచిపోతుంది...నీకు 2009 నుంచి ప్రజలు  కర్రుకాల్చి వాతలు పెట్టారు. కవ్వంపల్లి నీ భాష మార్చుకోకుంటే  గుణపాఠం తప్పదు  అని  ఇల్లంతకుంట వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ అన్నారు.  ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీటీసీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ  నిన్న ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ  , ఎంపీపీ వెంకటరమణ రెడ్డి  మాట్లాడినవన్ని అబద్దాలని ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సైతం వదిలేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, రెండు సార్లు ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుపొందిన గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారిని కవ్వంపల్లి సత్యనారాయణ వాడు, వీడు అంటూ మాట్లాడటం పద్ధతి కాదన్నారు.

 కవ్వంపల్లి వెంటనే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారికి క్షమాపణలు చెప్పాలి. ఎమ్మెల్యే రసమయి గారిని స్థానికేతరుడు అంటున్నావ్... నువ్వు హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రులు పెట్టుకుని ఎందుకు బ్రతుకుతున్నావ్, ప్రజల దగ్గర నుంచి లక్షలు వసూళ్లు చేస్తున్నావ్. నీకు ప్రజలపై ప్రేమ ఉంటే ఆస్పత్రి కట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించు దమ్ముంటే.  మా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారు.  అయ్యా ఎంపీపీ వెంకటరమణ రెడ్డి గారు మండలంలో  నీ ముఖం ఎలా ఉంటుందో ఎవరికి తెలియని సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు నిన్ను ఇల్లంతకుంట మండలానికి తీసుకొచ్చి సెస్ డైరెక్టర్, ఎంపీపీ పదవులను ఇచ్చారు.ఎన్నికలకు ముందుగానే నిన్ను ఎంపీపీ అభ్యర్థి అని ప్రకటించారు.  నీ ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే రసమయి గారు ఎంతో కష్టపడ్డారు...బీఆర్ఎస్ పార్టీ భీ ఫామ్ పై ఎంపీటీసీ గా గెలిచి ఎంపీపీ అయిన మీరు మీ పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలన్నారు.