ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

చిగురుమామిడి ముద్ర న్యూస్:దేవి శరన్నవరాత్రుల సందర్భంగా  చిగురు మామిడి మండల కేంద్రంలోని పార్వతి చంద్రశేఖర స్వామి ఆలయ మండపంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారిని మంగళవారం రోజు ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆకవరం మఠం శివప్రసాద్  తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ... మండలంలోని 17 గ్రామాలు ప్రజలు ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులతో పాటు అన్నదాతలతో కలిసి మహా అన్నదానం ప్రారంభించారు. వరుసగా మూడు సంవత్సరాలు గా దుర్గామాత మండపంలో అన్నదనం నిర్వహిస్తున్న మహేందర్ కవిత దంపతుల ను ఎంపీపీ కొత్త వినిత తో పాటు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు గాది రఘునాథరెడ్డిని శాలువ లతో దుర్గామాత కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముఖర పద్మా సదానందo,  మాజీ వైస్ ఎంపీపీ ఆకవరం భవాని, చిట్టిమల్ల రవీందర్, గడ్డం రాంరెడ్డి, ఉల్లెంగుల సదానందం తదితరులు పాల్గొన్నారు.