ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి: డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలలో భువనగిరి  నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి  శనివారం హైదరాబాదులోని శాసనసభ మందిరంలో ప్రోటీన్ స్పీకర్ గా శాసనసభను నడిపిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆయన ముద్ర ప్రతినిధితో మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం లోని ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన నేను నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గం లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని మమేకం చేస్తానని తెలిపారు. ఈ దిశగా నియోజకవర్గంలోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.