సీఎం కేసీఆర్  పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు

సీఎం కేసీఆర్  పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు

ఖైరతాబాద్, ఉప్పల్ లో పీఆర్ డివిజన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేశామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ  ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఖైరతాబాద్, ఉప్పల్ లో ఏర్పాటు చేసిన పీఆర్ డివిజనల్ కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉండగా మిషన్ భగీరథ తో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా పంచాయతీరాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్తగా నాలుగు చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, 12 కొత్త సర్కిల్, 11 డివిజన్లు, 60 కొత్త సబ్ డివిజన్లు, నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తున్నాయన్నారు.