కావేరీ జలాల వివాదం..

కావేరీ జలాల వివాదం..
  • రాజ్యాంగ ధర్మాసన ఏర్పాటుకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కావేరీ జల పంపకాలకు సంబంధించిన వివాదంపై రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి లక్షలాది మంది ప్రజలకు ఇరిగేషన్, తాగునీటి అవసరాలను కావేరీ జలాలు తీరుస్తున్నాయి. దీంతో కావేరీ జలాల పంపాకలపై తరచు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీనిపై చివరిసారిగా 2018లో సుప్రీంకోర్టు విచారణ జరిపి, కావేరీ మేనిజిమెంట్ స్కీమ్‌ను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. జలాల పంపాకలపై సుప్రీంకోర్టు తీర్పును అమలును చేసేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. అయితే, కావేరీ మేనేజిమెంట్ స్కీమ్‌ను ఇంతవరకూ కేంద్రం నోటిఫై చేయలేదు. దీంతో తరచు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. 

బెంచ్ ఏర్పాటు ద్వారా ఈ వివాదానికి అంతిమ పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది వారాల్లో బెంచ్ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 15లోగా తమ వాదనలను కోర్టుకు సమర్పించాలని రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రాల అవసరాలు, పర్యావరణం, శాంతి భద్రతలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఉపయుక్తమైన నిష్పాక్షిక నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం తీసుకోవాల్సి ఉంటుంది.