ఎస్సీల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట

ఎస్సీల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

సిద్ధిపేట : ముద్ర ప్రతినిధి:  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ సంక్షేమంలో అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టారని,తొలి కల్యాణ లక్ష్మీ పథకం ఎస్సీలతో ప్రారంభమైందని, దళిత బంధు పథకం రాకతో దేశమే ఆశ్చర్యపోతున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం జిల్లాలోని 300 మంది ఎస్సీ కులాల లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో కలిసి చెక్కులు, మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అంబేద్కర్ సెక్రటేరియట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధితో పాటు దళిత జాతి అభివృద్ధికి పాటు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం కోమటి చెరువు వద్ద 25 కోట్ల రూపాయలతో  చేపట్టనున్న శిల్పారామం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలోనూ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు .మంత్రి హరీష్ రావు వెంబడి వారం రోజులు ఉంటే అతను జీవిత కాలం ఎమ్మెల్యేగా గెలుపొందడానికి శిక్షణ పొందవచ్చని చెప్పారు సిద్దిపేట అభివృద్ధి రాష్ట్ర దిక్సూచిలా మారిందని కొనియాడారు.