సబ్బండ వర్గాల ఆర్థిక అభివృద్ధి కేసీఆర్ కృషి

సబ్బండ వర్గాల ఆర్థిక అభివృద్ధి కేసీఆర్ కృషి
  • స్థానిక బిడ్డను అభివృద్ధి చేసిన ఆశీర్వదించండి
  • చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్

ముద్ర, చొప్పదండి:నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సోమవారం గంగాధరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు.ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని తెలిపారు.అందరికీ అందుబాటులో ఉంటున్న,ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది.అన్ని వర్గాల  జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందని వెల్లడించారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం..ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం,ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పేదల పట్ల మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.ప్రస్తుతం ఉన్న ఆసరా పింఛన్ను రూ.5వేలకు,దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానివ్వడమే అని అన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం కూడా మరోకసారి రైతాంగం పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్రద్ధకు ఉదాహరణ అని అన్నారు.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను,మహిళలను ,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్ గారి కార్యదక్షతను తెలియజేస్తుందని, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు.