బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమవుతుందని జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు అమరవాదిలో గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సుపరిపాలన, సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు.అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ అధిష్టానం చెన్నూరు నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే పోటీ చేసి, నియోజవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు జంగపెల్లి మల్లయ్య,పోలింగ్ బూత్ అధ్యక్షుడు చిట్టవేణి హరీష్, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, సీనియర్ నాయకులు వెంకన్న,క్రాంతి,కుమార్,ప్రశాంత్, పోషం తదితరులు పాల్గొన్నారు.