తెలంగాణ సాధన మార్గదర్శకుడు ప్రో. జయశంకర్

తెలంగాణ సాధన మార్గదర్శకుడు ప్రో. జయశంకర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ సాధన మార్గదర్శకుడు ప్రోపేసర్ జయశంకర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ప్రోపెసర్ జయశంకర్ జయంతి వేడకలు నిర్వహించారు. డా. చంద్రశేఖర్ గౌడ్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ విద్యార్థి దశ నుంచే తెలంగాణ సాధన కోసం తపన పడిన వ్యక్తి అని అన్నారు. ఆయన విది విధానాల ద్వారానే తెలంగాణ సాధించుకుని , అయన వేసిన బాటలోనే తెలంగాణ నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ గాంధీ, పాటకులు, విద్యార్థులు పాల్గొన్నారు.