రైతులకు ఇబ్బంది పెట్టొద్దు

రైతులకు ఇబ్బంది పెట్టొద్దు
  • పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి
  • జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని జనగామ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో మూడు మండలాల్లో నష్టం జరిగిందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసి నష్టంపై నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ సూచనలు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వడ్లను కొనుగోలు చేసి ఓపి ఎమ్మెస్ లో ఎంటర్ చేసి ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలన్నారు.

 కొనుగోలు సెంటర్ల పరిశీలన 

జిల్లాలో లింగాల గణపురం మండలంలోని మాణిక్యపురం, నెల్లుట్ల, కళ్లెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తనిఖీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న నర్మెట్ట మండలం కన్నెబోయిన గూడెం, జిల్లా విద్యాశాఖ అధికారి రాము పెద్దమడూరు ధారావత్ తండా, డీవీహెచ్ఓ డాక్టర్ మనోహర్ జఫర్గడ్ మండలం తిమ్మంపేట,  ఓబులాపురం హిమ్మత్ నగర్, మత్స్యశాఖ అధికారి నాగులు, అక్కరాజు పల్లి, అబ్దుల్ నాగారం, డీసీఓ కిరణ్ కుమార్ డీసీఎస్ఓ రోజా రాణి, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి ఏపీడీ నూరుద్దీన్ వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.