హైస్కూల్‌ స్టూడెంట్లకు డ్రాయింగ్ కాంపిటీషన్ 

హైస్కూల్‌ స్టూడెంట్లకు డ్రాయింగ్ కాంపిటీషన్ 

ముద్ర ప్రతినిధి, జనగామ: ప్రపంచ జనాభా దినోత్సవం ( 11జూలై 2023) సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు సోమవారం జిల్లా స్థాయి పోస్టర్ మేకింగ్ డ్రాయింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. ఈ పోటీలో జె.ప్రవళిక (జడ్పీ హెచ్ఎస్ చీటూరు) విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలువగా, పి.వర్ష (కేజీబీవీ నర్మెట్ట) ద్వితీయ స్థానంలో, కె.కార్తీక్ (జడ్పీహెచ్ఎస్ కొడకండ్ల) తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఈవో కె.రాము నగదు పారితోషికం అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక సెయింట్ మేరీ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశానికి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా డీఈవోతో పాటు జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ నర్సింహారావు, ప్లానింగ్ సెక్టోరియల్ అధికారి రాజు, డ్రాయింగ్ మాస్టర్ సయ్యద్ హష్మతుల్లా ముఖ్య అతిథులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్.అనీల్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, 15 మంది గైడ్ టీచర్స్ పాల్గొన్నారు.