ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొదట  అంబేద్కర్ విగ్రహానికి, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌడ సంఘం అధ్యక్షుడు బొంగోని యాదగిరి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ఆవశ్యకతపై వివరించారు.

ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్, సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి, ఉపాధ్య క్షుడు దేశిని రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్, నాయకులు రాపోలు మదుసూద న్ రెడ్డి, సానాది రాజు, ఉమ్మగొని రాజు, రేకుల రాజు, ఐలోని రవి, ఐలోని రాజు, సిద్దుల సుదర్శన్, ఎడమ శంకర్, ఐలోని కిరణ్, ఐలోని శ్రవణ్, రొయ్యల కనకయ్య, కోరు కొప్పుల మహేందర్, బూరుగు రవి, పాలకుర్తి నాగరాజు, ఉమ్మగొని యాకయ్య, మోడం కుమార్ తదితరులు పాల్గొన్నారు.