ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక అభివృద్ధి

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక అభివృద్ధి
  • మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకోవాలి
  • ఆయిల్ పేడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూర్ (ముద్ర న్యూస్): మోత్కూరు మండలం కొండగడప(జటంగిబావి) గ్రామ రైతు జటంగి ప్రశాంత్ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పేడ్ మొక్కలు నాటారు. అనంతరం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించి ఆయిల్ పామ్ సాగులో మెళుకువలు,సాగు వలన కలిగే లాభాలు రైతులకు వివరించారు.ఆయిల్ పామ్ సాగుతోనే రైతుల ఆర్థికాభివృద్ధి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరణకు శ్రీకారం చుట్టారు.

రైతులు మూస పద్దతిలో ఒకే పంట కాకుండా కాలానికి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శ్రమ తక్కువగా ఉండి అధిక ఆదయనిచ్చే పంటల వైపు రైతులు అడుగులు వేయాలి అలా చేసినప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.అలాంటి వాటిలో ముఖ్యమైన పంట ఆయిల్ పామ్ సాగు దీనిలో శ్రమ తక్కువగా ఉంటుంది కూలీల అవసరం పెద్దగా ఉండదు అలాగే చీడపీడల బెడద కూడా ఉండదు పండించినటువంటి పంటను అమ్మటానికి దళారీ వ్యవస్థ ఉండదు ఆయిల్ ఫెడ్ సంస్థ నే కొనుగోలు చేస్తుంది దానితోపాటు పంటను ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకువెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా ఇవ్వటం జరిగింది.

కావున రైతులందరూ ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి పెట్టాలని అన్నారు. మన జిల్లా,మండల ప్రజలకు ఈ పంట కొత్తదని ఎలాంటి అపోహలకు గురి అవ్వద్దు. ఆయిల్ ఫెడ్ సిబ్బంది అందుబాటులో ఉంటూ మీకు ఆయిల్ పామ్ సాగులో సలహాలు సూచనలు ఇస్తుంటారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు,దండేబోయిన వెంకన్న,లెంకల వేణు, అంబటి నర్సయ్య, దండేబోయిన నాగరాజు, దొండ నర్సయ్య, కొమ్మూరి యాదిరెడ్డి, కాలం నరేందర్ రెడ్డి, భాస్కర్, ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్ మమత రైతులు తదితరులు పాల్గొన్నారు.