మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు గుడ్‌బై . 

మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు గుడ్‌బై . 

ముద్ర ప్రతినిధి,కోదాడ:-కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తో  పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు శనివారం కారు దిగారు. ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నేని వెంకటరత్నం మాజీ బీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అల్తాఫ్ హుస్సేన్ తదితరులు కూడా చందర్రావు తో పాటు బీ ఆర్ఎస్ పార్టీకిరాజీనామా చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో చందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఇంకా తనతో పాటు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు మండల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు వేలాదిమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతామని వెల్లడించారు.ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని శపథం చేశారు. 
ఆదివారం ఉత్తమ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో జాయిన్ అవుతామని వారు ప్రకటించారు.