జోరుగా హాత్ సే హాత్ జోడో యాత్ర: పల్లెల్లో జిఎంఆర్ కు బ్రహ్మరథం..

జోరుగా హాత్ సే హాత్ జోడో యాత్ర: పల్లెల్లో జిఎంఆర్ కు బ్రహ్మరథం..
GMR Haath Se Haath Jodo Yatra

మహబూబ్ నగర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర భూత్పూర్ మండలంలో హుషారుగా సాగుతోంది. ఈ సందర్భంగా మండలంలోని మద్దిగట్ల గ్రామంలో మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నిలువ నీడ లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేదల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు నిర్మించి ఇవ్వాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ లను వదిలి ఇప్పుడు కొత్తగా రూ.3లక్షలు ఇస్తామని చెబుతున్నారని, కానీ వాటిని కూడా ఇవ్వరన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కూడా మోసం చేశాడన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.