పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ చేపట్టాలి..

పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ చేపట్టాలి..
  • సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బందిదే నని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి ల తో కలసి సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ ను నిర్వహించాలనీ, ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలనీ,ఉదయం ఏడు గంటల నుండి వాస్తవ పోలింగ్ ప్రారంభించాలని అన్నారు.

ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని,ఈవిఎంలకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా, ఏమైనా సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు తెలుపాలని అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధన ల మేరకు సీల్ వేసి రిసెప్షన్ కేంద్రాలలో అప్పగించాలనీ సూచించారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు. సజావుగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ... ఎన్నికల సామాగ్రి పంపిణీ కి పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో బుధవారం పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగింది.నియోజవర్గాల కేంద్రంలోని పంపిణీ కేంద్రం నుండి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపిఓలు తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రి తీసుకొని ప్రత్యేకించిన వాహనంలో పోలింగ్ కేంద్రాల కు బయలు దేరారు.