ఆమె విజయం.. ఆ తండ్రికి గర్వకారణం

ఆమె విజయం.. ఆ తండ్రికి గర్వకారణం

హైదరాబాద్, ముద్ర వార్తలు : అంతర్జాతీయ ఫాదర్స్ డే కు సరిగా ఒక రోజు ముందు.. తెలంగాణ పోలీస్ అకాడెమీలో శనివారం సాక్షాత్కారమైన ఈ దృశ్యం అందరినీ కదిలించి వేసింది. చిన్ని పాదాలతో... చిట్టి చిట్టి మాటలతో నాన్న గుండెలపై పడుకుని కబుర్లు చెప్పే ఆ చిట్టితల్లి... నేడు జాతీయ అత్యున్నత సర్వీస్ (IAS) అధికారిగా తండ్రి ముందుకు వచ్చినపుడు... ఆ కన్న హృదయం ఆనందతాండవం చేయకమానదు కదా... అదీ ఐఎఎస్ అయిన కుమార్తెకు, ఎస్పీ ర్యాంకు అధికారిగా వున్న ఆ తండ్రి సెల్యూట్ చేయడం ఒక కమనీయమైన అరుదైన దృశ్యమే. ఆమె విజయం ఆ కన్నతండ్రికి ఎంతో గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్ అకాడెమీకి వచ్చిన ట్రైనీ ఐఎఎస్ అయిన కుమార్తె ఉమా హారతి వచ్చినపుడు, అక్కడ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అయిన తండ్రి వెంకటేశ్వర్లు ఇలా సెల్యూట్ చేశారు. ఎంత అపురూపమైన దృశ్యమిది... తండ్రీ కుమార్తెలిద్దరికీ అభినందనలు.