మహనీయుడు కామ్రేడ్ పెరియార్ నుండి స్ఫూర్తిని పొందుదాం...!

మహనీయుడు కామ్రేడ్ పెరియార్ నుండి స్ఫూర్తిని పొందుదాం...!

కమ్యూనిస్టు విప్లవకారుడు 
కామ్రేడ్ జే ఎస్ ఆర్ పిలుపు
కాశ్మీర్ కు ప్రత్యేక అధికార చట్టాన్ని రద్దు చేసినట్టుగానే.... దేశం నుండి కులాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయండి...
ప్రధానమంత్రికి ప్రజా నేస్తం 
జై బోరన్న గారి విజ్ఞప్తి

మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం

మానవీయ విలువల సమాజానికి బాటలు వేద్దాం

పౌర సమాజానికి సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్
 జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ

పెరియార్ అంటె తమిళంలో రుషి, జ్ఞాని, పెద్దమనిషి అని అర్థం. వేలాది మంది మహిళలు ఒక భారీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు ఇచ్చిన ఓ అరుదైన బిరుదు పెరియార్.  తమ బతుకుల్లో మార్పుకోసం పోరాడిన వీరుడికి ఈ దేశంలో కేవలం మహిళల చేత గౌరవించబిడ్డ ఒకే ఒక వ్యక్తి పెరియార్.  మహిళల కోసం హిందుకోడ్ బిల్లు తెచ్చి తన పదవిని త్యాగం చేసిన  బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం ఇంకా నేటికి మహిళలు గుర్తాంచలేదు అనే అనాలి. పెరియార్ పూర్తి పేరు ఈరోడ్ వెంకట రామసామి నాయకర్. నాయకర్ అనే కులంతోకను వేలాది మందిని సమావేశపరిచి ఆ వేదిక మీదకు అన్ని కులాల వారిని కూర్చోబెట్టి కులం వల్ల జరిగే నష్టం సమగ్రంగా వివరించి అందరిచేత ఈ రోజు నుండి నా పేరు వెంకట రామస్వామి అని నా పేరు పక్కన నా కులాన్ని తెలిపే తోకను నాకు నీనుగా వదులుకుంటున్నాను అని ప్రకటింపజేసారు.

ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఇలా అన్నారు. కులం పునాదులమీద ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేము అని అన్నారు. ఐనా ఆయన వారసులం అని చెప్పుకునే చాలామంది తోకలు తొలగించుకో లేకపోయారు. కానీ 80 ఏళ్ళ క్రితమే  పెరియార్ స్పూర్తితో లక్షలాది మంది కులం తోకలు తొలగించుకున్నారు. నాటికి ఆంధ్రరాష్ట్రం తమాళనాడుతో కలిసే ఉండేది. ఆయన స్పూర్తి తెలుగు ప్రజలకు అనుకున్నంత అంద లేదనే చెప్పాలనీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిక్షణం ప్రజాహితాన్ని కోరుకునే ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ 9848540078 గారు....

పెరియార్ సంపన్న కులంలో వ్యాపారం చేసే (మున్నూరు కాపు- బలిజ) కులంలో పుట్టిన కూడా కులం గోడలను బాల్యంలొనే అధిగమించాడు. అన్ని కులాలకు రాజ్యాధికారం రావాలన్న రాజకీయ చైతన్యం ఆయనతోనే మొదలైందని చెప్పవచ్చు. 1917 నుండే ఆయన నాటి జాతీయ కాంగ్రెస్ సభల్లో అన్ని కులాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలా అనేకసార్లు పత్రిపాదించి,అనుకున్నది సాధించలేక పోయాడు. చివరకు కాంగ్రేస్ ని వీడి జస్టీస్ పార్టితో జతకట్టి స్థానికంగా రిజర్వేషన్ లు  సాధించి అమలు పరిచాడు. నేటికి తమిళనాడు లో 69 శాతం రిజర్వేషన్లు 1920 నుంచే అమలు చేస్తుండటం గమనించవచ్చు. ఆ తరువాత స్వా అభిమాన ఉద్యమం రూపొందించారు. 1925 నాటికే మనిషికి గౌరవం సమానత్వం చాలా ముఖ్యం అని వాటి పునాదులపై కొత్త సాంస్కృతికి పునాదులు వేసారు. మనిషికి డబ్బుకన్నా చదువుకన్నా స్వయం గౌరవం ముఖ్యమని చాటాడు. నేటికీ బలంగా ఉన్న కులాన్ని నిర్మూలించాలని, అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలించాలని ఆనాడే ఆలొచించాడు. వితంతు వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు విస్తృతంగా జరిపించారు.

పెరియార్ స్పూర్తితో 10 వేల మంది మహిళలు ఒకేసారి తమ మెడలో ఉన్న బానిస సంకేతాలు ఐన తాలిబొట్టు తెంపేసారు. నాటి పురోహిత వర్గం పాటించె అంటు ముట్టను అంతరానితనాన్ని ఎండగడుతూ "విడుదలై" పత్రికను, "కుడి అరసు" పత్రికలను స్థాపించి నడిపించారు.  నేటికి నిరంతరాయంగా విడుదలై పత్రిక వస్తుంది. తొలి కాపి నుండి నేటివరకు అన్ని రచనలు వ్యాసాలు తమిళనాడు లోని చెన్నై లోని పెరియార్ థడల్ (పెరియార్ సమాధి ) వద్ద గల లైబ్రరీ లో అందుబాటులో ఉన్నాయి. పెరియార్ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలను ఆలోచనలను తెలుగులో తమిళంలో ముద్రించి ఉచితంగా పంచాడు.  అంబేద్కర్ గారిని తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసిన మహనీయుడు పెరియార్. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈ దేశంలో పెరియార్ చేసిన పోరాటం ఇంకా ఎవరూ చేయలేదు. దేశం కోసం సమాజం కోసం ఆయనన్నిసార్లు జైళుకు వెళ్ళిన నాయకుడిని మనం మరొకరిని చూడలేము. విదేశ వస్త్ర బహిష్కరణ చేసాడు. తాను నిర్వహిస్తున్న అనేక పదవులు త్యాగం చేసాడు. మధ్యపాన నిషేదంకై తాను తన భార్య మరియు చెల్లెలు( కన్నమ్మాల్ నాగమ్మాల్) కృషి ఎనలేనిది. ప్రజా సమస్యలపై బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి  పెరియార్ జైలుకు వెళితే ఆయన శిష్యులు, భార్యా, చెల్లె లు  ఆయన దారిలో నిరంతరం పోరాడే వారు.

భారత దేశంలో తొలి మానవ హక్కుల పోరాటం అయిన వైక్కోం. ఆ పోరాటంకి నాయకత్వం వహించి విజయం సాధించింది పెరియార్ వైక్కోం వీరుడిగా పేరు గడించారు. కేరళలోని వైక్కోంలోని శివాలయం ఆలయం వీదుల గుండా బి.సి లకు ముఖ్యంగా గౌడ్, విశ్వబ్రాహ్మణ, పద్మశాలీలకు నడిచే హక్కులేదు. యస్‌సి యస్‌టీలకు ఆ దారి కనుచూపు మేరలోనూ కనిపించకూడదు. అలాంటి దుర్మార్గమైన కట్టుబాట్ల పై అలుపెరుగని పోరాటం చేశాడు పెరియార్. ట్రావెన్ కోర్ సంస్థానంలో పూజారులు పెరియార్ చనిపోవాలని రాజుకు చెప్పి రాణి గారి చేత వేలాది రూపాయలు ఖర్చు చేయించి శతృసంహార యాగం చేయించారు అక్కడి బ్రాహ్మణులు. ఆ సందర్భంగా యజ్ఞం ఆనంతరం ఆ సంస్థానం రాజు చనిపోయాడు. కాని పెరియార్ కి ఏమి కాలేదు.  ఇటీవల కుటుంబంతో పాటు చారిత్రక పోరాటం జరిగిన కేరళ రాష్ట్రంలోని వైక్కోం వెళ్ళి వచ్చాము. పెరియార్ 95 సంవత్సరాలు జీవించాడు. 1973 డిసెంబర్ 24 చనిపోయారు. తన తుది శ్వాస విడిచే వరకు ప్రజా చైతన్యం కోసమే జీవించాడనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ గారు కొనియాడారు.

ఆయన స్థాపించిన ద్రావిడ ఖజగం (డికె) అనే సాంస్కృతిక ఉద్యమ పార్టి స్పూర్తితో అన్నాదురై కరుణానిధి వంటి నాయకులు తయారై తమిళనాట కాంగ్రేసేతర ప్రాంతీయ పార్టీ డి యం కె ఆధ్వర్యంలో 1969 లోనె స్థానిక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఆ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆ తరువాత అన్నా డిఎంకె పార్టీ రావడం ఈ రెండు పార్టీలు బహుజనుల నాయకత్వంలో రావడం గమనార్హం. ఇప్పటికి బ్రాహ్మణ ఆధిపత్యంలో నడిచే బిజేపి కాంగ్రేస్ లకు అక్కడ స్థానం లేదు.  అందుకే కాన్షిరాం నాయకత్వంలో బియస్పి పార్టీ ఉత్తర ప్రదేశ్ లో అధాకారంలోకి వచ్చాక లక్షలాది మందితో  పెరియార్ మేళాను జరిపించారు. ఆ సందర్భంగా నాటి బి.జే.పి మత వెతిరేకి బ్రాహ్మణ వెతిరేకి అయినటువంటి పెరియార్ పేరుతో బియస్పి పార్టీ ణఘంగా మేళా  జరపడంతో  వారితొ స్నేహం వీడింది.  ఐనా మతానికి భయపడకుండా బహుజన స్పూర్తి ప్రదాత, రాజ్యాధికార దిక్సూచి ఐనా పెరియార్ ఆలోచన ముఖ్యమని భావించి బియస్  బిజేపి తో స్నేహం కన్నా పెరియార్ ఆలోచనలే ముఖ్యం అని పెరియార్ మేళా జరిపి తీరారు కాన్షీరాం గారు. అలాగే బాబాసాహెబ్ గారు కూడా పెరియార్ గారిని ముంబాయ్, పూనె పరిసర ప్రాంతాలకు పిలిపించి స్వయంగా ఆయనే  అనేక సభలు ఏర్పాటు చేసి పెరియార్ చేత ప్రసంగింపజేసారు. పెరియార్ ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి వేలాది ప్రసంగాలు ఇచ్చారు. ఆయన పిలుపు ఇస్తే లక్షలాది మంది తరలి వచ్చేవారు. తన ప్రసంగాలతో గంటలకోలది సమయం సభికులను కదలకుండా నిలబెట్టేవి. అతను గొప్ప మాస్ లీడర్. త్యాగంలోనూ అతను ఒక గొప్ప శిఖరం. దేశంలో మొదటిసారిగా ఈరోడు పట్టణంలో దళిత వాడలకు కులాయి (మంచినీటి నల్లాలు) ఏర్పాటు చేసాడు. తాను కాంగ్రేస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బ్రాహ్మణ పిల్లలకు ఇండ్లి వడ సాంబార్ పెడుతూ మిగితా వర్ణాల పిల్లలకు కారం అన్నం పెట్టడం గమనించి ఆ పాఠశాలకు నిధులు మంజూరు చేయడం ఆపేసాడు.  ముఖ్యంగా ఆయన పోరాటం అటు రాజకీయంగా, ఇటు సంఘ సంస్కరణ దిశగా సాగింది. మహిళలకు విడాకులు తీసుకునే హక్కు, తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు, అనవసరం అనుకుంటె గర్బం తొలగించుకునే హక్కు, కట్నకానుకలు లేని పెళ్ళిళ్ళు, స్వా అభిమాన పెళ్ళిళ్ళు,  దండల మార్పిడితో పూజారి లేకుండా మంత్ర-తంత్రాలు లేకుండా జరిపించడం, వితంతువులకు మళ్ళి పెళ్ళి చేయడం చేసారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు,  అస్పృశ్యత అంటరానితనం నిర్మూలనకు మహిళల చదువుల కోసం ఎంతో కృషి చేసాడు పెరియార్.... అని అభ్యుదయ వాది కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 పెరియర్ గారి త్యాగాన్ని ప్రజా నేస్తం జే ఎస్ ఆర్ అభినందించారు.

ఆయన చేయని పోరాటం లేదు. ప్రజల జీవనానికి అడ్డంగా ఉండే ప్రతిదాని సంస్కరణ కోసం పోరాడాడు. సమాజంలో అసమానతలకు దారితీసే ప్రతిదానిపై స్పందించారు. దేశ స్వాతంత్రం వచ్చిన రోజును ఉద్దేశించి మాట్లాడుతూ తెల్ల దొరల వెండి సంకెళ్ళు తొలిగి నల్లదొరల బంగారు సంకెళ్ళు వచ్చాయన్నారు. ఆరోజు ను బ్లాక్ డే గా జరిపారు. దక్షిణ భారత ప్రధానిగా ఉండాలని కోరినా, కేంద్రంలో మంత్రిపదవులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవులు  తన వద్దకు వచ్చినా తాను సున్నితంగా తిరస్కరించారు. చివరివరకు రాజకీయ పదవులకు దూరంగా ప్రజా పోరాటాలలో  గడిపాడు. అంతేకాదు రాజ్యాంగం అమలులోకి వచ్చాక చట్టం ముందు అందరూ సమానం అనే ఒక కారణంతో గతంలో సాధించిన రిజర్వేషన్ లు చెల్లవని తమిళనాడులో కొర్ట్ తీర్పు ఇచ్చింది. చెంపకం దొరై రాజన్ అనే ఆవిడ కేస్ గెలిచి మెడికల్ సీటు పొందింది. ఆ విషయం పై పెరియార్ పోరాడి రాజ్యాంగం లో చట్టం ముందు అందరూ సమానం అనే దానికి సవరణ చేయాలని వెనుకబడిన వారికోసం విధ్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కావాలని ఉద్యమం చేసాడు. రాజ్యాంగం నశించాలి వెంటనే రాజ్యాంగం సవరించాలి, రాజ్యం నశించాలో పాలకులు నశించాలి అని ప్రజలకు అనుచరులకు జైల్ బరోకి పిలుపు ఇచ్చాడు. వేలాది మంది అరెస్టు అయ్యారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత సమస్య గుర్తించి నాటి రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్  ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ లు కలిసి ఆర్టికల్ 15 కి ఎఫ్ క్లాస్ జోడించారు. అదే తొలి భారత రాజ్యాంగ సవరణ. ఆ సవరణ లేకుంటె, పెరియార్ పోరాటం చేయకుంటే నేటి యస్.సి, యస్.టి బి.సి లకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ లు ఉండేవి కావు. ఈ విషయం రిజర్వేషన్ లు అనుభవించే వారిలో నూటికి ఒక్కరికి కూడా తెలియకపోవచ్చు. 

బాబాసాహెబ్ తొ పెరియార్ కు గల స్నేహం ఈ దేశం చరిత్ర సంస్కృతిని మార్చింది అనవచ్చు. బర్మా మయన్మార్ రంగూన్ ప్రపంచ బౌద్ద మహాసభల్లో కలుకున్న పెరియార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెరియార్ సూచనతోనె లక్షలాది మందితో నాగపూర్ లో  బౌద్ధం స్వీకరించారు. ఒకరి ప్రభావం ఒకరిపై ఎంతో ఉంది. పెరియార్ కేవలం ఆరో తరగతి వరకు చదివారు. కాని చరిత్రను అర్థం చేసుకోవడంలో ముందు ఉన్నారు. నేడు యూనివర్సిటీ లలో చదివిన వారు సైతం భూమి ఎలా పుట్టిందో అర్థం చే‌సుకోలేని స్థితిలో ఉన్నారు. మతాల మత్తులో ఊగుతున్నారు. దక్షిణ భారతదేశం పై ఉత్తర భారతదేశ యొక్క పెత్తనం పై తిరుగుబాటు చేసాడు పెరియార్. హిందీ సంస్కృతం మాపై రుద్ద వద్దని హిందీ వ్యతిరేక ఉద్యమం చేసాడు. ప్రాంతీయ బాషలు బతికి ఉండటానికి కారణం అయ్యారు. దక్షిణ భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు వేరని మీము ద్రావిడులమని చాటాడు. ద్రావిడ ఉద్యమ పితామహుడుగా నిలిచాడు పెరియార్.  ఆయన చేసిన సంఘ సంస్కరణలు బ్రాహ్మణులకు తీవ్ర నష్టం కలిగించాయి. అందుకే నేటికి పెరియార్ పెరు ఎత్తగానే విషం కక్కుతారు బ్రాహ్మణులు. నాడు పెరియార్ పై చెప్పులతో దాడి చేసారు . అవే చెప్పులను రాముడు కృష్ణుడి విగ్రహాలకు వేసి ఈ విగ్రహాలలో ఏ శక్తి లేదు అని ఊరేగించాడు పెరియార్. బహిరంగంగా వినాయక గ్రహాలను ధ్వంసం చేసి ఆ విగ్రహాలలో ఏ మహిమా ఉండదని చూపించాడు. ఆ సందర్భంగా పెరియార్ ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష వేసే ముందు ఏదైనా చెప్పేది ఉందా అని జడ్జి అడిగితే పెరియార్ ఏమన్నారంటె "అయ్యా భక్తులంతా ఎక్కడ డబ్బులు పెట్టి కొన్నారో నీను అక్కడే డబ్బులు పెట్టి కొన్నాను. వారు నవ రాత్రులు పూజించి నీళ్ళల్లో పడేస్తున్నారు. నీను నాకు నచ్చినట్టు చేసి పడేయకుండా ఉపయోగపడేలా గచ్చుకు ఉపయోగించాను. వారందరికి వేసే శిక్షే నాకు వేయండి అన్నారు. ఆ దెబ్బకు సమస్య అర్థం చేసుకొని పెరియార్ ని విడిచిపెట్టారు. దేవుడిని పూజించడమే కాదు విమర్శించడం కూడా ఒక హక్కే అని నిరూపితం అయినది.

ఆయన జీవితంలో ఎన్నో స్పూర్తి దాయక  విషయాలు ఉన్నాయి. తెలుగులో ఆయన జీవితంపై పెరియార్ రామాసామి అనే పేరుతో సినిమా వచ్చింది. యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది. అందరూ తప్పక చూడండి. ఆ సినిమాకి మాటలు పాటలు  ప్రముఖ అంబేద్కరిస్ట్ డా. కత్తి పద్మారావు గారు రాసారు. బాహుబలి కట్టప్పగా నేడు ప్రసిద్ది చెందిన ప్రముఖ తమిళ నటుడు సత్యారాజ్ పెరియార్ పాత్ర చేసారు. మణియమ్మ గా ప్రముఖ నటి కుష్బూ నటించారు.  ఆయన స్పూర్తితో  ఆంద్రా పెరియార్ గా కొనియాడబడుతున్న డా.జయగోపాల్ గారు 1972లో భారత నాస్తిక సమాజం స్థాపించాడు. నేటికి 50 ఏళ్ళు. (1972-2022) ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కృషి చేసారు, చేస్తున్నారు. పెరియార్ రచనలు పెరియార్ జీవితం పోరాటం పై అనేక పుస్తకాలు రాసారు జయగోపాల్ గారు. 

పెరియార్, గోరా, జాషువా, జయగోపాల్, కత్తి పద్మారావు ల స్పూర్తితో ప్రతి నాస్తికుడు ఒక పెరియార్ కావాలి. సంఘ సంస్కరణకు పాటు పడాలి. నేటి సమాజంలో ఇంకా అనేక అసమానతలు, అంధ విశ్వాసాలు కొనసాగుతున్నాయి.  మంత్రాలు తంత్రాలు దెయ్యాలు, భూతాలు, చెడుపు, చిల్లంగి, బాణామతి, చేతబడి హత్యలు జరుగుతున్నాయి. కులం పేరుతో దాడులు, అంటరానితనం కొనసాగుతుంది. పరువు హత్యలు జరుగుతున్నాయి. దేవుడు పేరుతో దోపిడి కొనసాగుతుంది. వీటన్నింటి నిర్మూలన జరగాలి అంటె ప్రతి నాస్తికుడు ఒక పెరియార్ కావాలని కోరుతూ నేడు పెరియార్ 145(2023 సెప్టెంబర్ 17) జయంతి కావున అందరూ తమతమ పరిధిలో పెరియార్ జయంతి జరిపి స్మరించాలని ఈ సమాజం మార్పులో భాగం కావాలని అణగారిన వర్గాల శ్రేయోభిలాషి కామ్రేడ్ జే ఎస్ ఆర్ కోరుకున్నారు. 1879  సెప్టెంబర్ 17న పుట్టిన ఆయన, 1973 డిసెంబర్ 24 నమరణించారు‌. ఆయన పోరాటాన్ని తన దత్త పుతృడు వీరమణి గారు తమిళనాడు చెన్నయ్ కేంద్రంగా ముందుకు తీసుకుపోతున్నారు. అదే స్ఫూర్తిని నాస్తిక హేతువాదులు తీసుకొవాలని ఆశిస్తున్నాం. నేటి సంఘాలు దేవుడు లేడు అనే సత్యం చెప్పడానికే భయపడుతున్నారు. కాని ఆయన తన వీలునామాలో దేవుడులేడు, దేవుడు లేదు, దేవుడు లేనే లేడు‌. దేవుడిని ఆవిష్కరించినవాడు మహా మూర్ఖుడు. దేవుడి గూర్చి ప్రచారం చేసినవాడు దుర్మార్గుడు,  దేవుడిని పూజించేవాడు అనాగరికుడు" అని తన చిత్ర పటం కింద రాయండి అని రాసాడు. అందుకే ఆయన విగ్రహాల కింది పై వాక్యాలు రాసి ఉంటాయి. పెరియార్ రామసామి అటు రాజకీయాలకు, ఇటు సామాజిక ఉద్యమాలకు, సంఘం సంస్కరణకు పాలనా సంస్కరణలను, మూఢనమ్మకాల నిర్మూలనకు, దేశభక్తికి, త్యాగానికి, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతిరూపం. ఈ వ్యాసం పూర్తిగా చదివినందుకు జనహితాన్ని కోరుకునే కామ్రేడ్  జే యస్ అర్ మీకు ధన్యవాదములు తెలియజేశారు...

మానవత్వం వర్ధిల్లాలి
 కులమతాలు నశించాలి.