జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు పలువురు వెల్గటూర్ విద్యార్థుల ఎంపిక... క్రీడాకారులను అభినందించిన ఎంఈఓ- బత్తుల భూమయ్య

జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు పలువురు వెల్గటూర్ విద్యార్థుల ఎంపిక... క్రీడాకారులను అభినందించిన ఎంఈఓ- బత్తుల భూమయ్య

వెల్గటూర్, ముద్ర :  వెల్గటూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడల్లో పాల్గొని ప్రతిభను కనబరిచి జగిత్యాల జిల్లా స్థాయి పోటీలకు  ఎంపికయ్యారు. ఈమేరకు వీరిని ఎంఈఓ బత్తుల భూమయ్య మంగళవారం పాఠశాల ఆవరణలో అభినందించారు. కాగా అండర్ 17 బాలికల కబడ్డీ విభాగంలో ఎం శిరీష , వెన్నెల, అస్మిత , శ్రావణీలు ఎంపిక కాగా వాలీబాల్ లో అమూల్య, సంజన, అస్మిత, అక్షయలు కో-కో లో వెన్నెల, శిరీషలు ఎంపికయ్యారు.  కబడ్డీ అండర్ 17 బాలుర  విభాగం  శ్రీ చరణ్, వినయ్ , బీ చరణ్ , విష్ణులు ఎంపికకాగా వాలీబాల్ లో ఎం.వంశీ , సిద్ధార్థ, సాయి చరణ్, జి .గణేష్ లు ఎంపికయ్యారు.  షాట్ పుట్ లో సంజన, 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీ చరణ్, 800 మీటర్స్ పరుగు పందెంలో కే .గణేష్, షార్ట్పుట్ లో శ్రీ చరణ్ ,సిద్ధార్థ, లాంగ్ జంప్ లో శ్రీ చరణ్ లు ఎంపికయ్యారు.వాలీబాల్ లో అండర్ -14 బాలికల  విభాగంలో కే. ప్రత్యూష , తేజస్విని, లిఖిత, అలేఖ్య, ఎం వైష్ణవి, ప్రియ, ప్రదీప్తి లు ఎంపికయ్యారు. 

కో-కో  అండర్ 14 విభాగంలో కే .మధుశ్రీ , పి .మధుప్రియ, ఎంపిక కాగా కబడ్డీలో బి. హర్షిని , జి .వైష్ణవి ,పి. వైష్ణవి ,ఎం. మాధురి, ఏ. స్పందన, సుహానలు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగులో శ్రీనిధి, షాట్ పుట్ లో ఏ. స్పందనలు ఎంపికయ్యారు . వాలిబాల్ లో అండర్ -14 వై. సాయి చరణ్, సాయి , మని విశాల్ , కబడ్డీ విభాగంలో ఎం .రాహుల్, ఏ. సాయిచరణ్ లు ఎంపిక య్యారు .కాగా వీరిని ఎస్జిఎఫ్  మండల చైర్మన్ బత్తుల భూమయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ,ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వై. కొండల్ రెడ్డి, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.