ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: పరీక్ష పత్రాల లీకేజీలలో నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చేపూరి చిరంజీవి, యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కీసర దిలీప్ రెడ్డి, చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమీది సురేష్,  మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐలపాక శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ నలిమెల ఏలియా, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మారపాక వసంత్,  జఫర్గడ్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటికాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి వ్యక్తిగత పూజితపై విడుదల చేశారు.