జనగామ ఎంసీహెచ్‌కు అరుదైన గౌరవం

జనగామ ఎంసీహెచ్‌కు అరుదైన గౌరవం

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ ఎంసీహెచ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్య సర్టిఫికేషన్‌లో జనగామ ఎంసీహెచ్‌కు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు నేతృత్వంలో ప్రోగ్రాం మేనేజర్ రాజశేఖర్, క్వాలిటీ మేనేజర్ స్రవంతి, ఆర్‌‌ఎంవో డాక్టర్‌‌ శంకర్‌‌ పర్యవేక్షణలో  లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ క్లీన్లినెస్ అండ్ హైజిన్ క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడంపై ప్రత్యేకంగా కృషి చేశారు.

ఈ క్రమంలో లక్ష్య సర్టిఫికేషన్‌లో 93 శాతం మార్కులు సాధించి మన ఎంసీహెచ్‌ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇందుకు కృషి చేసిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపోల్ దేశాయ్ అభినందనలు తెలిపారు.