సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: శంకరంపేట (ఆర్) మండలంలో సిఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. మల్లుపల్లిలో 5 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మల్లు పల్లి గ్రామానికి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. శాలిపేటలో ఐదు లక్షలతో  సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కరింపబడి రహదారుల అభివృద్ధి జరిగి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగెడుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందని గత పదేళ్ల కాలంతో పోల్చి చూస్తే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగి రైతుల రాబడి పెరిగిందన్నారు.

ఈ కార్యక్రమాలలో ఏఎంసి చైర్మన్ గంగా నరేందర్, సర్పంచ్ లు లక్ష్మిశంకరయ్య,  పోచయ్య, సర్పంచ్ రాజిరెడ్డి, రాజాసింగ్. గోపాల్ నాయక్, మాజీ సర్పంచులు సుధాకర్, రంగారావు, మనోజ్, ఎడ్ల కిష్టయ్య, పార్టీ సీనియర్ నాయకులు సాన సత్యనారాయణ, పడాల సిద్దిరాములు, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, చింతల సత్యనారాయణ, ఉపసర్పంచ్ జీవన్,  మాజీ ఎంపీటీసీలు ప్రతాప్ రెడ్డి, నాగరాజు, రమేష్ గౌడ్, సత్యాగౌడ్, శ్రీశైలం, వడ్లురి చంద్రం, లస్మగౌడ్. సాయిబాబా, కుమార్, యువనాయకులు రమేష్ గౌడ్, లింగంరాజు, కరుణాకర్, గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట(ఆర్) మండలం ఖాజాపూర్ కు చెందిన మండల టిఆర్ఎస్ నాయకుడు తిగుళ్ల బిక్షపతి  కుమారుడు కుమార్తెల ధోతి ఉత్సవానికి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి  హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.