పర్యాటకంలో సిరిసిల్లకు మహార్ధశ

పర్యాటకంలో సిరిసిల్లకు మహార్ధశ

ముఖ్యమంత్రి తనయుడు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన మార్క్ ను రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిరూపించుకోనున్నాడు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.కోట్లాది రూపాయాల అభివృద్ది పనులు చేసి.. సిరిసిల్ల చరిత్రలో ఎన్నాడు లేనంతగా అబివృద్ది చేసి.. తన సత్తా నిరూపించుకున్న మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల మిడ్ మానేర్ ను దేశంలోనే పేరుగాంచిన టూరిజం స్పాట్లకు తగ్గట్టుగా.. అంతకు మంచి సదుపాయాలతో.. వీకెండ్ టూరిజం స్పాట్ గానే  కాకుండా.. దేశంలో ప్రముఖ టూరిజం స్పాట్లలో ఒకటిగా సిరిసిల్ల పేరును నిలపాలని ముందుకెళ్తున్నారు. రెండేళ్ల క్రితమే  రెండు రోజుల పాటు జిల్లా అధికారులో హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ..మిడ్ మానేర్ ను పర్యాటక రంగంలో అభివృద్ది చెందేందుకు తీసుకునే చర్యలపై చర్చించారు. అధికారుల ప్రతిపాధనలు, బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలపై ఆర్థిక శాఖ అప్రువల్ కోసం పంపించినట్లు తెలిసింది. మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ సమీపంలో 90శాతానికి పైగా ప్రభుత్వ భూములు ఉండటంతో..భూసేకరణకు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా పోయింది. పర్యాటక పనులకు ఎలాంటి అడ్డంకులు కూడా  ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి..మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ సమీపంలో.. సిరిసిల్లకు అతి సమీపంలో  సూమారు 550 మీటర్ల ఎత్తు ఉన్న రామప్పగుట్ట ఉండటం, ఈ గుట్టపై 40 ఎకరాలకు పైగా ప్లేన్ ల్యాండ్..నిర్మాణాలకు అనుకూలమైన స్థలం ఉండటంతో.. ఈ టూరిజం స్పాట్కు మరింత విలువ పెరిగింది. ఈ గుట్టపై అతిథి గృహం నిర్మించడానికి అధికారులు సన్నహాలు చేస్తున్నారు.

సిఎం స్థాయి వివిఐపీ వచ్చిన..అన్ని రక్షణ చర్యలతో.. కూడిన ఈ అతిథి గృహంలో విడిది చేసే విధంగా నిర్మాణం చేయనున్నారు. మిడ్ మానేర్ ప్రాంతంలో రామప్పగుట్ట ను ఆనుకొని కాటేజీలు, 100 ఎకరాల్లో ఆక్వాహబ్, 50 ఎకరాల్లో కాటేజీలతో పాటు, జలక్రీడలు, చిల్ర్డన్ పార్క్,హౌజ్ బోటింగ్,మానేర్పై ఊగే వంతెన, రైల్వే బ్రీడ్జీ,రోప్ వే, మానేరు బ్యాక్వాటర్ మద్యంలో ఉన్న ఐలాండ్లో విడిది కేంద్రాలు, బెంగుళూరు సమీపంలో ఉన్న కబిని నది పరిసర ప్రాంతాల్లో అభివృద్దిని మించి సిరిసిల్లలో టూరిజం ఏర్పాటులో చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. నిధుల సమీకరణలో ప్రభుత్వంపై బారం పడుకుండా పబ్లిక్, ప్రైవేట్ (పిపిపి మోడ్)సహకారంతో ఈ టూరిజం స్పాట్ను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. సిరిసిల్ల ఎమ్మేల్యే, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటికే పలు ప్రైవేట్ కన్సల్టెన్సి ఏజెన్సి ప్రతినిధులు, టూరిజం ఎండి సిరిసిల్ల మిడ్ మానేర్ను సందర్శించి వివరాలు ఇప్పటికే సేకరించారు. సర్వేలు చేయించారు. ఏడాది క్రితమే టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మిడ్ మానేర్ను క్షేత్ర సందర్శన చేసి..రామప్ప గుట్టను, జలశయాన్ని సందర్శించారు. టూరిజం ఏర్పాటు, పర్యాటక అభివృద్దిపై చర్చించారు. వీలైనంత త్వరగా సిరిసిల్ల టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దెందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకెళ్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం సిరిసిల్లను టూరిజం స్పాట్గా తీర్చిదిద్దెందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేయడంతో వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ క్లీయరెన్స్ కోసం టూరిజం శాఖ ప్రయత్నాలు మమ్మురం చేసిందని తెలిసింది.