త్వరలో మంచు మనోజ్​– భూమా మౌనిక పెళ్ళి

త్వరలో మంచు మనోజ్​– భూమా మౌనిక పెళ్ళి
Manchu Manoj Bhuma Mounika

మంచు మనోజ్  మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక తో కలిసి సీతాఫలమండి లో ఒక వినాయక మంటపానికి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది. అయితే అప్పట్లో వాళ్లిద్దరూ వివాహం చేసుకుంటున్నారు, మీడియాతో మాట్లాడుతారు, తేదీ ఇదిగో ఆదిగో అంటూ ఏవేవో వార్తలు చిలవలు పలవల్లా వచ్చాయి.  

కానీ ఈసారి మాత్రం తేదీ ఖరారు అయినట్టుగా కనపడుతోంది. మార్చి 3వ తేదీ పెళ్లి ఫిక్స్  అయినట్టుగా సోషల్​ మీడియాలో  వైరల్ అవుతోంది. అయితే ఇటు మంచు కుటుంబం నుండి కానీ, అటు భూమా కుటుంబం  నుండి కానీ ఎటువంటి అధికారిక వార్తలు మాత్రం వెలువడలేదు.  వీరిద్దరి వివాహానికి మంచు వారింట్లో ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని  వినపడుతోంది. సోషల్​ మీడియాలో  కొన్ని ఫోటోలు  వైరల్ అవుతున్నాయి. దానిని బట్టి మార్చి 4వ తేదీన వివాహం జరగనుందని సమాచారం. వేదిక ఎక్కడనేది ఇంకా తెలియదు.