రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరు విషమం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరు విషమం

భూదాన్ పోచంపల్లి ,ముద్ర;రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్పురం గ్రామానికి చెందిన మృతుడు కేసారం ప్రశాంత్ (19) ఆసుపత్రిలో చూపించేందుకు బ్రీజా కారును సెల్ఫ్ డ్రైవ్ కు  అద్దెకు తీసుకొని తన స్నేహితులైన నర్ర శివ, శ్రీకాంత్, నర్ర రాఘవేంద్ర, శాపాక నవదీప్ లను వాహనంలో ఎక్కించుకొని పోచంపల్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్ మూలమలుపు పెద్ద అదుపుతప్పి అతివేగంతో పక్కనే ఉన్న వెంచర్ లోకి దూసుకెల్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడింది. దీంతో కారులో డ్రైవింగ్ చేస్తున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కారుపై ఉన్న విద్యుత్ స్తంభం తో పాటు తీగలను తొలగించి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రశాంత్ ను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ విక్రమ్ రెడ్డి తెలిపారు.