రాగి నాణెం చూపించి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తులు

రాగి నాణెం చూపించి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తులు

రాగి నాణెం చూపించి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తులు అరెస్టు ముద్ర ప్రతినిధి సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 7గంటల సమయంలో సిఐ రాజశేఖర్ కి కొత్త మార్కెట్ లో గల పశువుల సంత వద్ద ఒక మహిళ, ఒక పురుషుడు అనుమానాస్పద వస్తువు తో ఉన్నారని వచ్చిన నమ్మదగిన సమాచారం రావటంతో సూర్యాపేట డిఎస్పీ పి.నాగభూషణం ఆదేశానుసారం సిఐ జి.రాజశేఖర్ ఆధ్వర్యం లో యస్.ఐ యస్ కె.యాకూబ్ క్రైమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జి. కృష్ణయ్య, జి. కరుణాకర్,పిసి లు సైదులు,కె. ఆనంద్ కొత్త మార్కెట్ లో గల పశువుల సంత వద్ద కు వెళ్ళి అక్కడ ఉన్న ఒక మహిళా,ఒక పురుషుడు లను తనిఖీ చేయగా వారి వద్ద ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక రాగి నాణెం, ఒక కత్తెర ఉండటంతో వారిని విచారించగా వారి పేర్లు దండు సౌజన్య,యస్ కె.అజారుద్దీన్ అని గతంలో తన భర్త లేట్ రామరాజ్ ద్వారా తెలిసిన విషయం ఏమనగా ఈ రాగి నాణెంకి కొన్ని విశిస్ట శక్తులు కలిగి ఉంటుంది దీని విలువ బయట మార్కెట్ లో లక్షలు, కోట్లు ఉంటుంది అని నమ్మబలికి మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసి తన భర్త కూడా అప్పట్లో ఈ ప్రయత్నాలు చేసేవాడని, ఆయన చనిపోయిన తరువాత తనకు ఈ మధ్య ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో తనకు పరిచయం ఉన్న మిర్యాలగూడ కు చెందిన యస్ కె.అజారుద్దీన్ సహాయంతో పై రాగి నాణెంను చూపించి సూర్యాపేట కు చెందిన ఒక వ్యక్తి కి మాయ మాటలు చెప్పి ఈ నాణెం ను టెస్ట్ చేసి చూపించగా దానిని 10 లక్షలకు మాట్లాడుకొని గతంలో 6లక్షల 50 రూపాయలు తీసుకున్నాము. మంగళవారం అతని వద్ద 50 వేల రూపాయలు తీసుకొని మరలా రాగి నాణెం ను టెస్ట్ చేసి అతనికి హాండోవర్ చేసే క్రమంలో పట్టుబడి చేయడం జరిగినది. వారి వద్ద రాగి నాణెం, ఒక సూది దారం, ఒక కత్తెర,50 వేల రూపాయల నగదు ను స్వాదీనం చేయనైనది.అరెస్ట్ చేసిన ముద్దాయిలను రిమాండ్ కు తరలించారు.