కబ్జాకు గురైన చెరువును కాపాడాలి

కబ్జాకు గురైన చెరువును కాపాడాలి
  • చెరువులో కూడిపిన మట్టిని తీయాలని గ్రామస్తుల డిమాండ్

ముద్ర, ఎల్లారెడ్డిపేట: కబ్జాకు గురైన చెరువును కాపాడాలని  చెరువులో నింపిన మట్టిని వెలికి తీయాలని  విద్యుత్ లైన్లు వేయరాదని కబ్జాదారుడైన వ్యక్తిని అల్మాస్పూర్ గ్రామస్తులు  నిలదీసిన సంఘటన వెలుగు చూసింది.ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలోని రంగ చెరువును రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గోవర్ధన్ గౌడ్ కబ్జాకు గురైన విషయంలో గురువారం  గ్రామంలోని గ్రామస్థులు అందరూ మూకుమ్మడిగా  వెళ్లి రంగ  చెరువును ఎప్పటిలాగే  పునరుద్దించాలని డిమాండ్ చేశారు.చెరువును అనుకోని ఉన్న ఎంతో మంది రైతుల భూములు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు .చెరువును ఆక్రమించిన గోవర్ధన్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.ఎప్పటిలాగే చెరువును పునరుద్దించాలని లేని పక్షంలో ఊరి చెరువు విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామని గ్రామస్థులు అన్నారు. చెరువు పునర్నిర్మాణం జరిగే చోట అక్కడ ఎలాంటి పనులు జరపకూడదని డిమాండ్ చేశారు.కాగ ఎల్లారెడ్డి పేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి చెరువు దగ్గర విద్యుత్ లైన్ పనులు జరిపి తీరుతామని ఈ విషయంలో అడ్డువస్తే గ్రామస్థుల అందరి మీద కేసులు పెడతానని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరిని వివరణ కోరగా భూమి ఓనరైన గోవర్ధన్ గౌడ్  విద్యుత్ లైన్లు వేయాలని సుమారు మూడు లక్షలు సెస్ అధికారులకు చెల్లించారని తన భూమిలో మాత్రమే విద్యుత్ లైన్లు వేయడానికి తమ సిబ్బంది వెళ్లారని నేను ఎవరి మీద కేసులో పెడతానని కానీ బెదిరీయ లేదని తెలిపారు. ఈ సందర్భంగా  బీజేపీ ఉపాధ్యక్షులు సింగరవేని కృష్ణహరి మాట్లాడుతూ చెరువు విషయంలో ఎంత దూరమైన వెళ్తామని, కేసులు తమకేం కొత్త కాదని ఎన్నో కేసులు అక్రమంగా పెట్టిన చెరువును దక్కించుకుంటమని పేర్కొన్నారు.చెరువు పునరుద్దించాలని తాము మాట్లాడితే కేసులు పెడతాం అని బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని  అన్నారు. ఈ కార్యక్రమంలో  బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, కొండం శ్రీను, పందిర్ల శ్రీనివాస్,  చందు యాదవ్ సొనవేని రాజయ్య, బిపేట మల్లయ్య, క్యాడం శ్రీనివాస్ పందిర్ల శ్రీనివాస్ రెడ్డి, నారాయణరెడ్డి, నాగేల్లి శ్రీనివాసరెడ్డి, రేండ్ల భూమయ్య, గొడుగు సతీష్,బొడ్డు సురేష్, అభిషేక్ యాదవ్,  స్వామి తదితరులు పాల్గొన్నారు.