నేత్ర వైద్య శిభిరానికి స్పందన

నేత్ర వైద్య శిభిరానికి స్పందన

ముద్ర, మల్యాల:లయన్స్ క్లబ్ కోరుట్ల వారి ఆధ్వర్యంలో మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని కొత్త సురేష్ (హెచ్ పి) పెట్రోల్ పంపు వద్ద గురువారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిభిరానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అందులో 90 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆస్పత్రికి తరలించనున్నట్లు పెట్రోల్ పంపు ప్రోపరేటర్ కొత్త సురేష్, లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు 45 మందిని ఆసుపత్రికి చెందిన బస్సులొ తరలించారు. వైద్య శిభిరంలొ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, సెక్రటరీ మహేందర్, కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.