అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. 

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. 
Rachakonda police arrested international drug gang

మల్కాజిగిరి (ముద్ర న్యూస్): అంతర్జాతీయ నార్కోటిక్స్ పెడ్లింగ్ రాకెట్ ను రాచకొండ పోలీసులు ఛేదించారు. 500 గ్రాముల సూడోపెడ్రిన్ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ బి ఎస్ చౌహాన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 55 లక్షలు వుంటుందని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఓ టి మల్కాజిగిరి, నాచారం పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు విదేశీయులతో పాటు నలుగురు నిందితులు షేక్ ఫరీద్ అహమ్మద్ అలీ, ఫైజాన్ అరుణ్ ముజాహిదీన్ లను అరెస్టు చేశారు. హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు అంతర్జాతీయ కొరియర్ సర్వీస్ ద్వారా పార్సిల్ చేయబడే సూడో పెడ్రిన్ రహస్య సరఫరా చేసేవారు. 2500 నగదు, 80 గ్రాముల బంగారం, ఒక పాస్ పోర్టు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.