నేతాజీనగర్ లో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు

నేతాజీనగర్ లో ఘనంగా  రిపబ్లిక్ వేడుకలు

హైదరాబాద్, ముద్ర ప్రతినిధి: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గురువారంనాడు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, ఖాలిద్ సర్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మహా నేతలకు ఘనంగా నివాళుల్పించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సమకూర్చిన హక్కులను వినియోగించుకోడంతో పాటు బాధ్యతలను కూడా నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి అప్పారావు, కోశా ధికారి ప్రభాకర్, మాజీ అధ్యక్షులు టి ఎస్ ఆనంద్, సత్యంబాబు, మాజీ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి, గంగాధరన్, మాణిక్ రెడ్డి, సురేందర్ రావు, సోమేష్ మిట్టల్, డాక్టర్ సంజీవ రెడ్డి, రంగారెడ్డి, రవీందర్ రెడ్డి, మాలిక్, ఆనంద్, ఉమేశ్, రామేశ్వర్ రెడ్డి, పి. శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంక్రాంతి పండుగ సదర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రధానం చేశారు.