శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీతో బేటీ ఐన  రేవంత్ రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే

శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీతో బేటీ ఐన  రేవంత్ రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే

జోరుగ మంతనాలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, నధీమ్ జావిద్, రోహిత్ చౌదరి, మధుయాష్కి గౌడ్, వి. హన్మంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సోమవారం సాయంత్రం బేటీ అయ్యారు.డొమెస్టిక్ అరేయ్ విల్ లాంచ్ లో రాహుల్ గాంధీతో భేటీ అయిన వీరంతా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన  కోసం మంతానాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్బంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత కర్ణాటక రాష్ట్రంలో ని హుమనాబాద్ నుండి నేరుగా శంషాబాద్ లో దిగారు. 4:30 నిమిషాలకు ఇండిగో విమానంలో తిరిగి డిల్లీ బయలుదేరి వెల్లారు.