Ys Sharmila Arrest మానుకోటలో షర్మిల అరెస్ట్ హైదరాబాదుకు తరలింపు

Ys Sharmila Arrest మానుకోటలో షర్మిల అరెస్ట్ హైదరాబాదుకు తరలింపు
Ys Sharmila Arrest

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల వైఎస్సార్ టిపి అద్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి కనిపించడంతో ఆమె పాదయాత్ర అనుమతిని రద్దు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేసి  హైదరాబాద్ తరలించారు. 

మహబూబాబాద్ లో శనివారం సాయంత్రం జరిగిన వైయస్సార్ టిపి బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ..  తీవ్రపదజాలౌతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను విమర్శించారు. దీంతో అసహనానికి గురైన భారాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షర్మిల రాత్రిబసు చేసిన ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేశారు పరిస్థితి ఉధృతంగా మారడం తో రంగంలోకి దిగిన పోలీసులు వైయస్ షర్మిలకు నోటీసులు ఇచ్చారు  పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి మహబూబాబాద్ తరలించారు. అక్కడినుండి పోలీసు వాహనంలో హైదరాబాద్ తీసుకువెళ్తున్నారు.