గజ్వేల్ నియోజకవర్గం లో పనులను వేగవంతం చేయండి

గజ్వేల్ నియోజకవర్గం లో పనులను వేగవంతం చేయండి

అధికారులకు కలెక్టర్ సూచన

సిద్దిపేట ముద్ర ప్రతి నిధి :గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి  పనులను ఆదర్శంగా నిలపాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ సూచించారు
గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గజ్వేల్ నియోజకవర్గంలో  మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల వారిగా ఎచ్ఎం, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో పాలనాధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాలనాధికారి ప్రశాంత్ జె పాటిల్ మాట్లాడుతూ 
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంన్ని మన ఊరు మన బడి పథకంలో చేపడుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను రాష్టానికే ఆదర్శంగా నిలిచేలా పని చేయ్యాలని అధికారులను సూచించారు.
పాఠశాలల్లో టేండర్ పనులు ప్రారంభం నుండి పూర్తి అయ్యేవరకు రోజువారిగా సమన్వయంతో పర్యవేక్షణ చేస్తు కాంట్రాక్టర్ తో పనులు చెయుంచాలని డిఈ, ఎఈ లకు తెలిపారు.
వర్గల్, కొండపాక మండలాలతో పాటు పథక పనులు నత్తనడకన సాగుతున్న పాఠశాలను డిఈఓ పర్యవేక్షణ చేయాలి.
నియోజకవర్గంలో సివిల్ పనుల్లో కొందరు కాంట్రాక్టర్ లు అలసత్వం ప్రదర్శిస్తున్నందున అందరినీ సమన్వయ పరిచి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈడబ్లుఐడిసి ఈఈ కి తెలిపారు. 
పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే సుందరీకరణ చేయ్యాలని సూచించారు. అందులో స్టిల్ అక్షరాలతో పాఠశాల బోర్డు తప్పనిసరి, పెద్ద గేట్ పైన ఆర్చ్, మెట్లకు గ్రానైట్, స్టేజ్ పక్కన గ్రానైట్, గడ్డి కార్పైట్, ఇతర పనులను చెయ్యాలని, సుందరీకరణ బాద్యతలు ఆయా మండల ఎచ్ ఎం, ఎంఈఓలు తీసుకోవాలని.
ఎప్పటి పనులకు అప్పుడు ఎప్టిఓ జనరేట్ చేయాలని ఎఈలకు తెలిపారు. అలాగే ఈజీఎస్ పనుల ఎప్టిఓలను జనరేట్ చెయ్యడానికి ఎంపిడిఒ,ఎంపిఓలు ఎఈలకు తోడ్పాటు నందించాలి.
ఈజీఎస్ పనుల్లో వేగం పెంచడానికి చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పిడి కి తెలిపారు. రోజువారిగా పర్యవేక్షణ చెయ్యాలని ఎంపిడిఒ, ఎంపిఓ, ఎపిఓ లకు తెలిపారు.
మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఇట్టి సమావేశం లో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఈడబ్లుఐడిసి ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.