అన్నదానంలోనూ ఆదర్శంగా నిలిచిన పేట మున్సిపాలిటీ

అన్నదానంలోనూ ఆదర్శంగా నిలిచిన పేట మున్సిపాలిటీ
  • పేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి గణేష్ విగ్రహం వద్ద స్టీల్ ప్లేట్లు,  గ్లాసులతో భక్తులకు  అన్నదానం
  •  ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు మండపాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్లాస్టిక్ గ్లాసులను వాడుతుండగా మున్సిపల్ కార్యాలయంలో స్టీల్ పాత్రలతో గణేష్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సూర్యాపేట మున్సిపాలిటీ  ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పర్యావరణహిత మట్టి గణేష్ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టీల్ పాత్రలతో ప్లాస్టిక్ వినియోగం లేకుండా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు తొమ్మిది రోజుల పాటు గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్తులు మండపాల వద్ద ప్లాస్టిక్ను అధికంగా వినియోగిస్తున్నారని ఇది పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. దీని గమనించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు సందేశం ఇవ్వాలని లక్ష్యంతోనే తమ స్టీల్ బ్యాంకులోని స్టీల్ పాత్రలతో ఈరోజు గణేష్ విగ్రహం వద్ద ప్లాస్టిక్ రహితంగా స్టీల్ వస్తువులతో అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలంతా ప్లాస్టిక్ నివారించేందుకు సహకరించాలని కోరారు. అలాగే నేడు నిర్వహించే గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఉత్సవాన్ని ఉత్సవ కమిటీలు భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజుల రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు,  అధికారులు, నాయకులు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.