మా నియోజకవర్గంలో వేలు పెట్టొద్దు ... కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇందిరా

మా నియోజకవర్గంలో వేలు పెట్టొద్దు ... కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇందిరా
Station Ghanpur Congress party charge Indira fire

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మా నియోజకవర్గంలో వేరే నియోజకవర్గ నాయకులు వేలు పెడితే సహించేది లేదని స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిరా హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ జూడో కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 6 నుండి మూడు నెలల పాటు కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలోని గడపగడపకు తీసుకువెళ్తామన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. దళిత నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ లో పార్టీ కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వేరే నియోజకవర్గ నాయకులు మా నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడు పాదయాత్రకు ప్రజాదరణ పెరిగిందని నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Also Read: సీఎం కేసీఆర్ గవర్నర్ కు క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • సీజనల్ బెగ్గర్స్ వస్తారు.. పోతారు
  • టిపిసిసి సభ్యుడు అమృత రావు

ఎన్నికలు దగ్గర పడ్డాయి అంటే కొంతమంది నాయకులమని చెప్పి వస్తారు.. పోతారు.. వారంతా సీజనల్ బెగ్గర్స్ అని అమృత రావు ఎద్దేవ చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఎవరు ప్రోత్సహిస్తే ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదని పార్టీకి, వాటి సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ గెలుపుకు కృషి చేసేవాళ్ళు కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, లింగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శిరీష్ రెడ్డి, గడ్డమీద సురేష్, ఎంపీపీ మేకల వరలక్ష్మి, విజయ మేరీ, మండల మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ, మార్కు శ్రీనివాస్, కోరుకొప్పుల  మహేందర్, దిలీప్ రెడ్డి నక్క పాపయ్య, పద్మ, పులి మల్లమ్మ, మంచాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.