సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత...

సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-దేశ ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఫాలి.ఎస్.నారిమన్ (95) కన్నుమూశారు. ఆయన ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నవంబర్ 1950లో నారిమన్ బాంబే హైకోర్టులో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నారు. 1961లో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదా లభించింది. బాంబే హైకోర్టు తర్వాత, నారిమన్ 1972లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. మే 1972లో భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 

జనవరి 1991లో నారిమన్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. నారిమన్ 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా కూడా ఉన్నారు. 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా పని చేశారు.